Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ కంపెనీలోని వందలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధంచేసింది. సంస్థలోని ఆపరేషన్స్, టెక్నాలజీ ఆర్గనైజేషన్, అమెరికా మార్టిగేజ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించనుందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఇది కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 2,40,000 మంది ఉద్యోగుల్లో ఒక శాతం మాత్రమేనని పేర్కొన్నది. ఉద్యోగుల తొలగింపు అనేది తమ వార్షిక ప్రణాళికలో భాగంగా సాధారణంగా జరిగే ప్రక్రియేనని సంస్థ వెల్లడించినట్లు పేర్కొన్నది. ఒక్కో విభాగంలో ఒక్కో కారణంతో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారని తెలిపింది.
ఇప్పటికే సిటీ గ్రూప్ పోటీదారైన జేపీ మోర్గాన్ సంస్థ గతవారం వందల సంఖ్యలో ఉద్యోగులను వదిలించుకున్నది. జనవరి నెలలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ దాదాపు 3200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. వారిలో 7 వందల నుంచి 8 వందల మంది ఉద్యోగులు భారత్‌లోనే ఉన్నారు. ఉద్యోగులను తొలగింపులో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు చాలా ముందున్నాయి. బ్రిడ్జివాటర్ అసోసియేట్స్ కూడా సుమారు 100 మంది ఉద్యోగులను తొలగించింది.