Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - షిల్లాంగ్: మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా రాజీనామాకు ఆ రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్ ఆమోదం తెలిపారు. అయితే, తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సంగ్మాను గవర్నర్ కోరారు. కాగా, సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో విజయం సాధించింది. మెజారిటీకి మరో 12 స్థానాలు తక్కువ కావడంతో ఆ ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తాజాగా 59 స్థానాలకు జరిగిన మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్పీపీ, బీజేపీ వేర్వేరుగా పోటీచేశాయి. ఎన్పీపీ మునుపటి కంటే 7 స్థానాలు ఎక్కువగా 26 స్థానాల్లో గెలుపొందింది. కానీ బీజేపీ మాత్రం గతంలో గెలిచిన 10 స్థానాలను పోగొట్టుకుని రెండు స్థానాలకు పరిమితమైంది. ఇప్పుడు ఎన్పీపీ, బీజేపీ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో ఇద్దరి సభ్యుల మద్దతు కావాల్సి ఉంది. మేఘాలయా అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. అయితే, తీరా పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు యూడీపీ అభ్యర్థి మరణించడంతో ఆ ఒక్కస్థానానికి ఎన్నిక జరగలేదు. కాబట్టి మొత్తం 59 స్థానాల్లో 30 మంది సభ్యుల బలం ఉన్న పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అవకాశం ఉంది.