Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖ
విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పచ్చదనం: డీకార్బనైజేషన్, పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, డిజిటలైజేషన్, ఆంట్రపెన్యూర్షిప్ ఈ నాలుగు రాష్ట్రానికి మూల స్తంభాల్లాంటివని అభివర్ణించారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రమని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పరిశ్రమల అవసరాల్ని తీర్చేలా అంతర్జాతీయ స్థాయిలో 26 నైపుణ్య కాలేజీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతు న్నాను. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి. తొలిరోజు 92 ఎంవోయూలు రాగా మొత్తం 340 ఎంవోయూలు. దీని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.