Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీ ముందుకొచ్చారు. ఏపీలో తాము సిమెంట్ ఫ్యాక్టరీలు, డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్ ప్రకటించగా సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఇందుకు వేదికైంది. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో భాగంగా తొలి రోజు ఈ ప్రకటనలు వెలువడ్డాయి.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సీఈఓ, గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ ప్రకటించారు. 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కడప, నడికుడిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖలో 400 MW డేటా సెంటర్ను నెలకొల్పనున్నట్లు తెలిపారు. వీటితో పాటుగా 10 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. పెట్టుబడిదారుల సదస్సుకు స్వయంగా హాజరైన ఆయన ఈ మేరకు దీని గురించి ప్రకటన చేశారు.