Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకోవడమే కాకుండా ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ తరుణంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 899 పాయింట్లు పెరిగి 59,809కి చేరుకుంది. నిఫ్టీ 272 పాయింట్లు లాభపడి 17,594 వద్ద స్థిరపడింది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకింగ్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.