Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇవాళ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ రేపు (శనివారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీలో ఉన్నారు.
గత ఆదివారం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయగానే కోర్టులో హాజరపర్చిన సీబీఐ ఐదు రోజుల కస్టడీ కోరింది. సీబీఐ కోరినట్టుగానే మనీశ్ సిసోడియాను విచారించేందుకు కోర్టులో మార్చి 3 వరకు సీబీఐ కస్టడీ విధించింది. ఇవాళ్టితో ఆ కస్టడీ గడువు ముగిసింది. ఈ క్రమంలో సిసోడియా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.