Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి కన్నుమూశారు. రామలక్ష్మి ప్రఖ్యాత విమర్శకులు, గీతరచయిత, కవి ఆరుద్ర సతీమణి. ఆరుద్ర, రామలక్ష్మి దంపతులు తెలుగు సాహితీరంగానికి ఎనలేని సేవ చేశారు. వీరు మార్చి 3న హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు.
రామలక్ష్మి 1930 డిసెంబర్ 31వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కోట నందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో బి.ఏ.పట్టా పుచ్చుకున్నారు. మాతృభాష తెలుగులోనే కాకుండా ఆంగ్లంలోనూ ఆమెకు ఎంతో పట్టుండేది. 1951 నుండీ రచనల చేయడం మొదలు పెట్టారు. 1954లో వెలుగు చూసిన రామలక్ష్మి రచన విడదీసే రైలుబళ్ళు పేరు సంపాదించి పెట్టింది. ఆ తరువాత ఆమె కలం నుండి “మెరుపు తీగె, అవతలిగట్టు, తొణికిన స్వర్గం, ప్రేమించుప్రేమకై, ఆంధ్రనాయకుడు, పండరంగని ప్రతిజ్ఞ” వంటివి రచించారు. ఆమెని కోల్పోవడం తెలుగు సాహితీ లోకంలో తీరని లోటు.