Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రకు భద్రత పెంచాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రేవంత్ పాదయాత్రకు తగిన భద్రత ఇస్తున్నామని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రేవంత్ పాదయాత్రకు భద్రత ఇవ్వాలని అదనపు డీజీ ఎస్పీలకు లేఖ పంపారని కోర్టుకు దృష్టికి తెచ్చారు. అదనపు డీజీ రాసిన లేఖను జీపీ హైకోర్టుకు సమర్పించారు. ఈ తరుణంలో వాదనలు విన్న న్యాయస్థానం పాదయాత్రకు భద్రత కల్పిస్తే విచారణ కొనసాగించాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్న భద్రత ఉందో? లేదో? సోమవారం కోర్టుకు తెలపాలని రేవంత్ తరఫు న్యాయవాదికి సూచిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.