Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
నవతెలంగాణ - హైదరాబాద్
కార్పోరేట్ శ్రీచైతన్య కళాశాలలో మార్కులు, ర్యాంకులు దాహం కోసం వేధింపులు గురి చేసి, దాడి చేసిన శ్రీచైతన్య యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులు కృష్ణా రెడ్డి, ఆచార్య, జగన్, నరేష్ లపై ఐపిసి, 305, 302 సెక్షన్లు. కేసులు నమోదు చేసిన ఇంత వరకు అరెస్ట్ చేయలేదని, పోలీసులు యాజమాన్యం తో సెటిల్ మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని శ్రీచైతన్య యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష్యా, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు లు మాట్లడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని మరోక విద్యార్ధి నష్టపోకుండా కమీషన్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు అందించిన వారిలో ఎస్.ఎఫ్.ఐ. హైదరాబాద్ జిల్లా అధ్యక్ష్యా, కార్యదర్శులు లెనిన్ గువేరా, కె.అశోక్ రెడ్డి పాల్గొన్నారు.