Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జోగులాంబ గద్వాల
మహబూబ్ నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ , మైక్రో అబ్జర్వర్లలతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర ముఖ్యమని అన్నారు
ఈ తరుణంలో జిల్లాలో 877 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలో 11 పోలింగ్ స్టేషన్ల ను ఏర్పాటు చేశామని, 13 మంది ప్రిసైడింగ్ అధికారులు, 13 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 12 మంది మైక్రో అబ్జర్వర్లు, ఆరుగు సెక్టోరియల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. ఈ నెల 12 న ఎన్నికల సామగ్రీతో రూట్ వారీగా వెళ్లాలని వివరించారు. ఈ నెల 13 న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఓటు 1,2,3,4 ప్రకారంగా ప్రిపరేన్సు ఓటు వేయవచ్చన్నారు. బ్యాలెట్ పేపర్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు , పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలట్ బాక్సులు రిసిప్షన్ కేంద్రానికి చేరే వరకు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్, సూపరింటెండెంట్ వరలక్ష్మి, జిల్లా నోడల్ అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీధర్ రెడ్డి, రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.