Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నార్సింగిలోని ఓ కార్పొరేట్ కళాశాల తరగతి గదిలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మృతుని వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. సాత్విక్ మృతికి కారకులైన ప్రొఫెసర్లు ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్ నరేశ్‌లతో పాటు జగన్‌లపై 305 సెక్షన్ కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ తరణంలో నలుగురు అధ్యాపకుల వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు సాత్విక్ రాసినట్లు ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. ‘అమ్మా నాన్నా నేను ఈ పనిచేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశం లేదు. మెంటల్ టార్చర్ వల్లే చనిపోతున్నా. కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అధ్యాపకులు ఆచార్య, నరేశ్, శోభన్ హాస్టల్లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. వీటిని తట్టుకోవడం నా వల్ల కాలేదు. ఇలాంటి వేధింపులు ఇంకెవరికీ రాకూడదని కోరుకుంటున్నా. వీరందరిపై కఠినచర్యలు తీసుకోవాలి’ అని ఆ లేఖలో ఉంది. లేఖతో పాటు, సాత్విక్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో 305 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.