Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వహించిన కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను శుక్రవారం సీబీఎస్ఈ విడుదల చేసింది. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7వరకు జరిగిన పరీక్షల్లో ఈసారి పేపర్- 1కు 17,04,282మంది రిజిస్టర్ చేసుకోగా 14,22,959మంది హాజరయ్యారు.
వీరిలో 5,79,844మంది అర్హత సాధించినట్టు సీబీఎస్ఈ వెల్లడించింది. ఇక, పేపర్- 2 విషయానికి వస్తే 15,39,464మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా 12,76,071 మంది హాజరయ్యారు. వీరిలో 3,76,025 మంది అర్హత సాధించారు. రెండు పేపర్లు కలిపి మొత్తంగా 9.5లక్షల మంది క్వాలిఫై అయ్యారు.