Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మేడ్చల్ : గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి విశాల్ మృతి చెందారు. చికిత్స కోసం సీఎంఆర్ తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు. సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థి విశాల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. విశాల్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
ఇటీవల కాలంలో చాలా మంది అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. అప్పటివరకు బాగానే ఉన్నవారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు చేరిపోతున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.