Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
గన్నవరం కేసులో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కు ఊరట లభించింది. ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం ఘటనలో పట్టాభితో పాటు మిగిలిన వారికి కూడా బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం పలు షరతులు విధించింది. మూడు నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని స్పష్టం చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. పట్టాభి తదితరులను కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఇటీవల గన్నవరంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. టీడీపీ ఆఫీసుపై దాడి జరగ్గా, కారు అగ్నికి ఆహుతైంది. ఈ క్రమంలో, తనను కులం పేరుతో దూషించారంటూ సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేత పట్టాభి తదితరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది.