Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆయా ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మూడు ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ నెల 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు, ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, ఏప్రిల్ 23న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మూడు నోటిఫికేషన్ల రాతపరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ స్పష్టం చేశారు. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను, 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.