Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫై చేసిన 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు చేసుకున్న సమయంలో పలు తప్పులు దొర్లిన నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు.. దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఈ నెల 4న ఉదయం 10 గంటల నుంచి 9వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. వ్యక్తిగత సమాచారం, మార్కులు తప్పుగా వేయడం, తప్పుడు సర్టిఫికెట్లు ఆప్‌లోడ్ చేయడం వంటి అంశాలను ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్‌కు ఒకేసారి అవకాశం ఉంటుంది కాబట్టి.. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తదితర వివరాల కోసం అనే వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.