Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పదో తరగతి చదువుతున్న బాలుడితో అతడికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలు అదృశ్యమైంది. వీరు తిరిగి వచ్చాక ప్రేమ విషయం వెలుగు చూసింది. హైదరాబాద్ శివారులోని చందానగర్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడి ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ యువతి (26) ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అదే పాఠశాలలో గచ్చిబౌలికి చెందిన బాలుడు (15) పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గత నెలలో వీరిద్దరూ అదృశ్యమయ్యారు. తన మనవరాలు కనిపించడం లేదంటూ ఆమె తాతయ్య చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ తర్వాత రెండు రోజులకే ఆమె తిరిగి ఇంటికి రావడంతో కేసును విత్‌డ్రా చేసుకున్నాడు. అదే సమయంలో తమ కుమారుడు కనిపించడం లేదంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత బాలుడు కూడా ఇంటికి చేరుకున్నాడు. ఎక్కడికెళ్లావంటూ బాలుడిని పోలీసులు ప్రశ్నించడంతో వీరిమధ్య ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. టీచర్‌తో కలిసి ఈ ఫిబ్రవరి 16న వెళ్లినట్టు చెప్పాడు. దీంతో ఆమెను కూడా పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉపాధ్యాయురాలికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతోనే ఆమె ఇలా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.