Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ప్రకాశం: ఒంగోలు బండ్లమిట్టలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాట్ సర్క్యూట్తో జాస్మిన్ క్రిస్టల్ ఎలక్ట్రికల్ షాపులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాపులో నుంచి మంటలు భారీ ఎత్తున్న ఎగిసిపడుతున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారుగా రూ.40లక్షలు పైగా నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.