Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 11 ఏప్రిల్ 2018లో అమర్నాథ్ విశాఖ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించారు. విశాఖ-పలాస ప్యాజింజర్ రైలును అడ్డుకుని రైల్‌రోకో నిర్వహించారు. ఈ ఘటనపై అమర్నాథ్తోపాటు మరికొందరిపై ఆర్పీఎఫ్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వంశీకృష్ణ యాదవ్, కొయ్య ప్రసాదరెడ్డి, పీవీ సురేష్, పసుపులేటి ఉషాకిరణ్, గరికిన గౌరి గత నెల 27న విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే కోర్టులో జరిగిన విచారణకు హాజరయ్యారు. అయితే, మంత్రి అమర్నాథ్తోపాటు, రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ హాజరు కాలేదు. మంత్రి తరపు న్యాయవాది వేసిన ఆబ్సెంట్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం.. అమర్నాథ్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.