Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో ఒత్తిడి, భయం, ఆందోళన నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించడానికి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకొన్నది. వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్ సేవలను ఉచితంగా వినియోగించుకొనే అవకాశం ఇచ్చింది. విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించి, ఒత్తిడి తగ్గించుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు.
ఈ టెలిమానస్ ద్వారా విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వడమేగాక మార్గదర్శనం చేయనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా, విద్యార్థుల్లో ఆందోళన, భయం, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. దీంతోపాటు ప్రభుత్వ దవాఖానల్లో జిల్లా మెంటల్ హెల్త్ క్లినిక్‌ల సేవలను 24 గంటల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని సూచించారు.