Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పల్నాడు జిల్లా సత్తెనపల్లిల్లో తాజాగా ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆర్టీసీ బస్సు కండెక్టర్ వృద్ధురాలిని బస్సులోంచి నెట్టేశాడు. త్వరగా దిగాలంటూ ఆమెను మెట్లపై నుంచి కిందకు నెట్టేశాడు. ఈ క్రమంలో కిందపడ్డ బాధితురాలికి స్వల్పంగా గాయాలయ్యాయి.
సత్తెనపల్లి డిపో వద్ద వృద్ధురాలు బస్సులో నుంచి దిగుతున్న సమయంలో కండక్టర్ ఆమెను తొందరపెడుతూ బస్సులోంచి తోసేశాడని తెలిసింది. దీంతో..వృద్ధురాలు బోర్లాపడటంతో ఆమె ముఖానికి గాయాలయ్యాయి. కిందపడ్డ బాధితురాలిని పైకిలేపే ప్రయత్నం కూడా చేయకుండా బస్సును ముందుకు పోనిచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. కండక్టర్ తీరుకు దిమ్మెరపోయిన వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. ఈ క్రమంలో తోటి ప్రయాణికులు డిపోలోని అధికారులు, ఇతర ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.