Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బాపట్ల
విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంకొల్లు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వీరబాబు (45) వేటపాలెం మండలం వాకావారి పాలెంలో విధులు నిర్వహిస్తున్నారు.
యథావిధిగా శనివారం విధులకు హాజరైన వీరబాబు విద్యార్థులకు పాఠాలు చెబుతుండగానే గుండెపోటు రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన విద్యార్థులు ఇతర ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే 108కి ఫోన్ చేసి సమాచారం అందజేశారు. వీరబాబుకి వైద్య సేవలు చేసిన సిబ్బంది అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్దారించారు. వీరబాబు మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.