Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మాస్కో
రష్యా శాస్త్రవేత్త ఆండ్రూ బొటికోవ్ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. స్పుత్నిక్-వీ టీకాను అభివృద్ధి చేసిన సైంటిస్టుల్లో ఆయన ఒక్కరు. తన స్వంత అపార్ట్మెంట్లోనే ఆయన శవమై తేలారు. బెల్ట్తోటి బొటికోవ్ గొంతును నులుమేసినట్లు రష్యా మీడియా కథనాలు తెలిపాయి. గమలేయా నేషనల్ రీసర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమెటిక్స్ లో 47 ఏళ్ల బొటికోవ్ సీనియర్ పరిశోధకుడిగా చేస్తున్నారు.
ఈ కేసులో హత్యకు పాల్పడిన అనుమానితుడిని అరెస్టు చేశారు. 29 ఏళ్ల ఓ అనుమానితుడు శాస్త్రవేత్తతో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ తర్వాత కోపంలో ఆ వ్యక్తి బొటికోవ్ను చంపినట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ క్రైమ్ కింద మర్డర్ కేసు నమోదు చేశారు. వైరాలజిస్ట్ మృతిపై హత్య కోణంలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ టీకాను సుమారు 18 మంది శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. దాంట్లో బొటికోవ్ ఒకరు.