Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులో ఉంటున్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్టాలిన్ భరోసా ఇచ్చారు. వలస కార్మికులకు ప్రభుత్వం రక్షణగా ఉంటుందని చెప్పారు. మీలో ఎవరినైనా ఎవరైనా బెదిరించినా, హింసించినా హెల్ప్ లైన్ కి ఫోన్ చేయాలని సూచించారు. వలసదారులకు తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు అండగా ఉంటారని చెప్పారు. బీహార్ నుంచి తమిళనాడుకు వచ్చిన వలసదారులపై దాడులు జరగుతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ ఈ మేరకు భరోసాను కల్పించారు. బీహార్ అసెంబ్లీలో కూడా ఈ అంశంపై వాడీవేడి చర్చ జరిగింది.