Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల విచారణలో బహిర్గతం
నవతెలంగాణ.. వెంకటాపురం
ఇన్సూరెన్స్ సొమ్ములకోసేమే లారీని తగులపెట్టమని పోలీసుల విచారణలో బహిర్గతమైనట్లు శనివారం పోలీసులు వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని అంకన్నగూడెం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఇసుక లోడింగ్ కోసం వచ్చిన టీఎస్ 29 టి 9944 అనే నెంబర్ గల లారీ సోమవారం రాత్రి కాలిపోయింది. లారీ డ్రైవర్, క్లినర్ లను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు ఇన్సూరెన్స్ సొమ్ముల కోసం లారీ ని తగుల పెట్టినట్లు ఒప్పుకున్నారు. 2019 లో లారీని కొనుగోలు చేశారు. లక్డౌన్ కారణంగా ఫైనాన్స్ కిస్థి లుకట్టడం ఇబ్బంది అయింది.3 నెలలుగా లారీ కిస్థి కట్టక పోవడంతో వడ్డీ వ్యాపారులనుంచి ఒత్తిడి మొదలైంది. లారీ కి ప్రమాదం జరిగితే వచ్చే ఇన్సూరెన్ సొమ్ములతో కిస్తీలు చెల్లిచుకొచ్చు అనుకున్నారు.ఇసుక లోడింక్ కోసం వచ్చి అంకన్నగూడెం అటవీ ప్రాంతం సమీపంలో లారీ ఉంచారు.అర్ధరాత్రి సమయం లో లారీని డీజిల్ పోసి తగుల పెట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి లారీని మావోయిస్టులు తగుల బెట్టి నట్లు అందరూ అనుకుంటారని అనుకున్నారు.కానీ పోలీసుల విచారణలో కుట్ర బైట పడిందని పోలీసులు వివరించారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు వివరించారు.
దురాశకు పోయి జైలు పాలు సిఐ కాగితోజు శివప్రసాద్
లారీ కిస్తీలు కట్టలేక దురాశ కు పోయి ఇన్సూరెన్స్ సొమ్ముల కోసం లారీని తగుల పెట్టి ప్రమాదం లో కాళీ పోయినట్లు చిత్రీకరణ చెశారని. దురాశకు పోయి లారీని తగుల పెట్టుకుంటే ఇన్సూరెన్స్ సొమ్ములు రాక పోగా జైలు పాలు కావలి వచ్చిందని సీఐ శివప్రసాద్ తెలిపారు.ఎవరైనా దురాశకు పోతే శిక్ష తప్పదని వివరించారు.