Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రంగారెడ్డి
జిల్లా పరిధిలోని కందుకూరులో దారుణం చోటు చేసుకుంది. దాసురపల్లిలో గ్రామ పరిధిలో ఉన్న ఓ ఫామ్ హౌస్లో నెల్లూరు జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి, శైలజా రెడ్డి వాచ్మెన్లుగా పని చేస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి శైలజా రెడ్డి ఒక్కరే ఫామ్ హౌస్లో ఉన్నారు. ఈ తరుణంలో రాత్రి 8:30 గంటల సమయంలో శైలజారెడ్డిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు.
అదే సమయంలో కుక్కలు గట్టిగా అరిచాయి. దీంతో సమీపంలో ఉన్న భర్త అప్రమత్తమై తమ గది వద్దకు పరుగెత్తాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను చూసి సురేందర్ రెడ్డి షాక్కు గురయ్యాడు. సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ అంజయ్య ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.