Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఉప కులపతిగా ప్రొఫెసర్ ఎం. విజ్జులత నియామకం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ ఎం. విజ్జులత ప్రస్తుతం కోటి మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ మహిళా యూనివర్సిటీ వీసీగా నియామకమైన విజ్జులతకు పలువురు ప్రొఫెసర్లు, ఇతరులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.