Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ, జీవితం మీద విరక్తి చెందిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక మండల పరిధిలోని హసన్ మీరాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనపై దుబ్బాక ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు ఉన్నాయి. మండల పరిధిలోని హసన్ మీరాపూర్ గ్రామానికి చెందిన జాలిగం బాబుకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు జాలిగం అఖిల్ (19) ఇంటర్ వరకు చదువుకొని, సిద్దిపేటలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న అఖిల్ ఎన్ని హాస్పిటల్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో జీవితం మీద విరక్తి చెంది అఖిల్ శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ,అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.