Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మొదలైంది. ఆరంభ పోరులో బేత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బేత్ మూనీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో, ముంబై జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. తొలి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తుది జట్టులో ఆడుతున్నది వీళ్లే..
గుజరాత్ జెయింట్స్ జట్టు: బేత్ మూనీ (కెప్టెన్), సబ్బినేని మేఘనా, హర్లీన్ డియోల్, అష్ గార్డ్నర్, డి.హేమలత, కిమ్ గ్రాత్, అన్నబెల్ సథర్లాండ్, స్నేహ్ రానా, మన్సీ జోషి, మోనికా పటేల్,తనుజా కన్వర్.
ముంబై ఇండియన్స్ జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), హేలీ మ్యాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, ధారా గుజ్జర్, అమేలియా కేర్, పూజా వస్త్రాకర్, అమన్‌జోత్ కౌర్, జింతిమణి కలిత, ఇసీ వాంగ్, సోనమ్ యాదవ్, సైకా ఇషక్.