Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీకాకుళం
నరసన్నపేట టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి రోడ్డుపై వెళుతున్న ఆటో నుంచి రూ.500 నోట్లు ఎగిరిపడడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై టోల్‌ప్లాజా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. రాత్రి 7.30 గంటల సమయంలో జాతీయ రహదారిపై వెళుతున్న ఆటో నుంచి రూ.500 నోట్లు ఎగిరిపడ్డాయి. ఆటోలో ఉన్న వ్యక్తులు బయటకు విసిరారా? లేకుంటే పొరపాటున జారిపడ్డాయా? తెలియాల్సి ఉంది. టోల్‌ప్లాజా సిబ్బందితోపాటు, లారీ డ్రైవర్లు, ద్విచక్రవాహనదారులు రోడ్డుపై పడిన నోట్లను ఏరారు. మొత్తం రూ.88వేలు శనివారం పోలీసులకు అప్పగించారు. ఆటోను గుర్తించే పనిలో ఉన్నట్లు ఎస్ఐ సింహాచలం తెలిపారు.