Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో పేలుడు సంభవించింది. చిట్టగాంగ్ సమీపంలోని కేశవ్‌పూర్ వద్ద ఉన్న ఓ ఆక్సిజన్ ప్లాంటులో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు మరణించగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు వల్ల ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, పేలుడు ధాటికి ఆక్సిజన్ ప్లాంట్‌కు రెండు చదరపు కిలోమీటర్ల వరకు బిల్డింగ్లు ప్రభావితమయ్యాయాని స్థానికులు వెల్లడించారు. అదేవిధంగా ఇనుప వస్తువులు పెద్దమొత్తం చెల్లాచెదురుగా పడిపోయాయని తెలిపారు.