Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉత్తరప్రదేశ్ లో వైద్యుల బాధ్యతారాహిత్యం ఓ బాలిక ప్రాణాలను రిస్క్ లో పడేసింది. ఒక్కటే సిరంజిని ఎక్కువ మందికి వినియోగించడం వల్ల బాలికకు హెచ్ ఐవీ సోకినట్టు సమాచారం. దీనిపై బాలిక తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ అంకిత్ కుమార్ అగర్వాల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తునకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. ఒకే సిరంజితో పలువురు చిన్నారులకు ఇంజెక్షన్లు ఇచ్చినట్టు బాధిత బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎతాలోని రాణి అవంతి బాయి లోధి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ను ఆదేశించినట్టు డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.