Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కొంత మంది దుండగులు హత్య చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లో ఈ దారుణమైన సంఘటన జరిగింది. పెట్రోల్ పోసి వ్యక్తిని తగలబెట్టారు దుండగులు. దీంతో ఆ యువకుడి బాడీ పూర్తిగా కాలిపోయింది. అయితే, స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి నిందితులు చేరుకున్నారు. అనంతరం ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.