Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: నటుడు మంచు మనోజ్ ఆదివారం కర్నూలుకు చేరుకున్నారు. వివాహం తర్వాత మొదటిసారి తన సతీమణి భూమా మౌనికా రెడ్డితో కలిసి ఆయన అత్తవారింటికి వెళ్లారు. మౌనికా రెడ్డి తాతయ్య ఎస్వీ సుబ్బారెడ్డి (శోభా నాగిరెడ్డి తండ్రి)ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. భారీ కాన్వాయ్ నడుమ వీరిద్దరూ కర్నూలుకు చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
మనోజ్, మౌనిక ఎన్నో ఏళ్ల నుంచి స్నేహితులు. గతంలో వైవాహిక బంధంలో ఎదురుదెబ్బలు తిన్న వీరిద్దరూ కుటుంబసభ్యుల అంగీకారంతో ఇటీవల పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లోని లక్ష్మి నివాసంలో శుక్రవారం రాత్రి వీరి వివాహం వేడుకగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. శనివారం వీరి పెళ్లి ఫొటోలు బయటకు రాగా.. నెటిజన్లు, సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.