Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ విజ్జులత నియమితులయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగానికి చెందిన ఆమె ప్రస్తుతం కోటి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. మహిళా విశ్వవిద్యాలయం తొట్ట తొలి వీసీగా ఆమె పేరు నిలిచిపోనుంది.
ఈ తరుణంలో ఆమె రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీగా కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం విజ్జులతను నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీచేశారు. అయితే ప్రొఫెసర్ విజ్జులత కోఠి మహిళా కళాశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం.