Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రెండేండ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్నది. జనరల్, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎడ్‌సెట్‌ను మే 18న ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో నిర్వహిస్తారు.
ఈ తరుణంలో ఎడ్‌సెట్‌ను గతంలో ఉస్మానియా వర్సిటీ నిర్వహించింది. ఈ ఏడాది నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్‌రావు, ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టీ కృష్ణారావు, ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ, ప్రొఫెసర్ ఏ రవికుమార్, ప్రొఫెసర్ పారుపల్లి శంకర్తదితరులు పాల్గొన్నారు.