Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గుండెపోటుతో ఇంటర్మీడియట్ విద్యార్థి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మరీదు రాకేశ్ (18) మధిర పట్టణంలోని ఓ ప్రైయివేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటి ఆవరణలో మిత్రులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతన్ని మధిరలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. రాకేశ్ గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది.