Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
భారత నావికాదళం ఇవాళ అరేబియా సముద్రంలో బ్రహ్మోస్ క్షిపణి పరీక్షను నిర్వహించింది. కోల్కతా శ్రేణి క్షిపణి విధ్వంసక యుద్ధనౌక బ్రహ్మోస్ క్షిపణి పరీక్షకు వేదిక అయ్యింది. ఆత్మనిర్బర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని ఇండియన్ నేవీ ప్రకటించింది. సముద్ర తలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. క్షిపణుల్లో స్వదేశీ తయారీ క్షిపణుల సంఖ్యను పెంచేందుకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ నిరంతరాయంగా కృషి చేస్తున్నదని ఇండియన్ నేవీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే దీనిని ప్రయేగించినట్లు సమాచారం.