Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అత్తింటివారు బంగారం పెట్టలేదని ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. మెదక్‌లోని గాంధీనగర్‌కు చెందిన శేఖర్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అత్తగారు బంగారం పెట్టలేదని.. ఆదివారం విద్యుత్ స్తంభం ఎక్కి హడావుడి చేశాడు. స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి, డీఎస్పీ సైదులు, సీఐ హామీ ఇవ్వడంతో ఆ వ్యక్తి కిందకు దిగివచ్చాడు.