Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆమ్ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌సిసోడియాను జైల్లో పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీశ్ సిసోడియా కేవలం ఐదేండ్లలోనే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను చక్కదిద్ది రూపురేఖలు మార్చేశారని, అందుకు బహుమానంగా ఆయనను జైల్లో పెట్టారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్ వసూలు చేస్తున్నదంటూ వచ్చిన ఆరోపణలను కేజ్రివాల్ ప్రస్తావించారు. సాధువు లాంటి మనీశ్ సిసోడియాను తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపినవాళ్లు, కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్ వసూలు చేసిన వాళ్లను మాత్రం వదిలేశారని విమర్శించారు. అందుకు ప్రధాని మోడీ సిగ్గుపడాలని మండిపడ్డారు. త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ వివిధ పార్టీల నేతలు తమ క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నారు. ఇవాళ ఆప్ చీఫ్ కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా తమ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడం కోసం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రాయచూర్‌లో ఏర్పాటు చేసిన సభలో కేజ్రివాల్ మాట్లాడారు.