Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆసక్తికరంగా సాగుతోంది. ఇవాళ రెండో మ్యాచ్ లో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ 32 బంతుల్లో 7 ఫోర్లతో 46 పరుగులు చేయగా, ఓపెనర్ గా వచ్చిన తెలుగుమ్మాయి సబ్బినేని మేఘన 15 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసి శుభారంభం అందించింది. ఆష్లే గార్డనర్ 25, దయాలన్ హేమలత 21 (నాటౌట్) పరుగులు సాధించారు. యూపీ వారియర్స్ బౌలర్లలో దీప్తి శర్మ 2, సోఫీ ఎకెల్ స్టోన్ 2, తెలుగమ్మాయి అంజలి శ్రావణి 1 వికెట్, తహ్లియా మెక్ గ్రాత్ 1 వికెట్ తీశారు.