Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తారకరత్న మరణవార్త మరువక ముందే మరొకరు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో తెరకెక్కిన ‘దర్శకుడు’ అనే సినిమాకు ప్రవీణ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. ప్రవీణ్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రవీణ్ దర్శకుడు సినిమాకు ముందు ‘పంజా’, ‘యమదొంగ’, ‘బాజీరావు మస్తానీ’, ‘ధూమ్-3’ వంటి పలు సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా పనిచేశాడు. ఆ తర్వాత 2017లో ‘దర్శకుడు’ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మారాడు. జక్క హరిప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుకుమార్ అన్న కొడుకు అశోక్ హీరోగా నటించాడు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రవీణ్ మూడు సినిమాలకు ఛాయాగ్రహకుడిగా పనిచేశాడు. అయితే అవి ఇంకా విడుదల కాలేదు.