Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తరప్రదేశ్
హోలీ జరుపుకునేందుకు పుట్టింటికి తీసుకెళ్లనందుకు తన భార్య అలిగిందని, ఆమెకు నచ్చజెప్పి బుజ్జగించేందుకు 10 రోజుల సెలవు కావాలని ఎస్పీకి పోలీస్ ఇన్స్పెక్టర్ రాసిన లీవ్ లెటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌కు చెందిన ఇన్స్పెక్టర్ రాసిన సెలవు చీటీలో.. సెలవులు దొరక్క పోవడంతో గత 22 ఏళ్లుగా తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లలేకపోయానని ఇన్స్పెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి తనతో కలిసి పుట్టింటికి వెళ్లాలని కోరుకుంటోందని, కాబట్టి తనకు సెలవులు తప్పనిసరిగా అవసరమని పేర్కొన్నారు. తన సమస్యను పరిగణనలోకి తీసుకుని పది రోజులు సెలవు మంజూరు చేయాలని కోరారు. ఈ లీవ్ లెటర్ చదివిన ఎస్పీ అశోక్ కుమార్ మీనా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇన్స్పెక్టర్ కోరినట్టు కాకుండా ఐదు రోజుల సెలవులు మంజూరు చేసినట్టు తెలుస్తోంది.