Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్ణాటక
కర్ణాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. మరోవైపు కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఎంఐఎం భావిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయింది. మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు పేర్లతో తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. కర్ణాటకలో కనీసం 20 స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారు. ఎంఐఎం టికెట్ల కోసం పోటీ కూడా ఎక్కువగానే ఉంది. టికెట్ కోసం పెద్ద ఎత్తున పైరవీలు కూడా జరుగుతున్నాయని సమాచారం.