Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్లో జరుగుతున్న ప్రాజెక్ట్-K షూటింగ్లో అమితాబ్ గాయపడ్డాడు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు అమితాబ్ గాయపడినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో అమితాబ్ పక్కటెముకలకు గాయాలయినట్లు తెలుస్తుంది. గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత అమితాబ్ ముంబై వెళ్లిపోయాడు. రెండు వారాల వరకు అమితాబ్ బెస్ట్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.