Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలోని పది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లలో ఎంసీఏ( మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే నీట్ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎడాది నిమ్సెట్ను జంషెడ్పూర్ నిట్ నిర్వహిస్తుండగా నిమ్సెట్-2023లో సాధించిన ర్యాంకుల ఆధారంగా అగర్తలా, అలహాబాద్, భోపాల్, జంషెడ్పూర్, కురుక్షేత్ర, కాలికట్, దుర్గాపూర్, రాయ్పూర్, సూరత్కల్, వరంగల్, తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో ప్రవేశాలు ప్రవేశాలు కల్పిస్తారు.
అయితే 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఎస్సీ/ బీఎస్సీ/ బీసీఏ/ బీఐటీ/ బీఈ/ బీటెక్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిట్ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్, వరంగల్ రెండేండ్ల కోర్సు తర్వాత వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేండ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పీజీ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
దీనిలో మొత్తం సీట్ల సంఖ్య: 813 ఉంటుంది.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 05
చివరితేది: ఏప్రిల్ 10
పరీక్ష తేది: జూన్ 11
వెబ్సైట్: https://www.nimcet.admissions.nic.in/
https://www.nimcet.in/