Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నార్సింగిలోని ఓ కార్పొరేట్ కళాశాల తరగతి గదిలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మృతుని వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.
ఈ తరుణంలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పలు అంశాలను పోలీసులు తెలిపారు. కళాశాలలో వేధింపుల కారణంగానే సాత్విక్ చనిపోయినట్లు స్పష్టం చేశారు. సాత్విక్‌ను అసభ్యకరంగా తిట్టడం వల్లే మనస్తాపం చెందాడు. తోటి విద్యార్థుల ముందు పదేపదే కొట్టడం వల్లే ఆవేదనకు గురయ్యాడు. ప్రొఫెసర్ ఆచార్యతో పాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచూ తిట్టడంతో సాత్విక్ మానసికంగా కుంగిపోయాడు. ఆత్మహత్యకు పాల్పడిన రోజు తల్లిదండ్రులు వచ్చి వెళ్లగానే సాత్విక్‌ను కృష్ణారెడ్డి చితకబాదాడు. ఇంట్లో వాళ్లని తిడుతూ ఆచార్య, కృష్ణారెడ్డి బూతులు మాట్లాడారు. హాస్టల్లో సాత్విక్‌ను వార్డెన్ నరేశ్ వేధించేవాడు’’ అని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.