Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో షీ టీమ్స్ ఆధ్వర్యంలో రైజ్ అండ్ రన్ పేరుతో 5కే, 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ తరుణంలో సీఎస్ శాంతికుమారు మాట్లాడుతూ మహిళలు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
సేఫెస్ట్ స్టేట్‌గా తెలంగాణ ఉందని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మహిళలందరూ వెనకడుగు వేయకుండా మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళా అధికారి ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండటం గర్వకారణమని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. దేశంలోనే నంబర్ వన్ స్టేట్ తెలంగాణ అని, చాలా రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడి విధానాలు నేర్చుకుంటున్నాయని తెలిపారు. తెలంగాణ పోలీసింగ్, షీ టీమ్స్ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు చూసి నేర్చుకుంటున్నాయని వెల్లడించారు.