Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాకిస్థాన్
బలూచిస్థాన్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిబ్బి అనే నగరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఓ ఆత్మాహుతి బాంబర్ మోటర్ సైకిల్ తో పోలీసు ట్రక్కు ను బలంగా ఢీ కొట్టినట్టు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.