Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర మహిళా విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతిగా ప్రస్తుత కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. విజ్జులత నియామకం అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నేడు బాధ్యతలు స్వీకరించారు. కోఠిలో ఉన్న కళాశాల ఆవరణలోని దర్బార్ హల్ జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య దండెపోయిన రవీందర్, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
అంతకు ముందు కళాశాల ఎన్.సి.సి విద్యార్థులు కవాతుతో పాటు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర మహిళా విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతిగా ఆచార్య ఎం. విజ్జుల్లత నియామకం పట్ల ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య దండెబోయిన రవీందర్ హర్షం వ్యక్తం చేశారు.